telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మహాభారత్ ను ఆమీర్ వదిలేసాడా…?

Aamir Khan actor

భారత సినిమా పరిశ్రమలో ఉన్న చాలా మంది హీరోలకు.. దర్శకులకు ఉండే కామన్ డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారత్. మంచి చేదు మధ్య జరిగిన ఈ కథను తెరక్కేకించాలని అందరూ అనుకుంటారు. అయితే అటువంటి దానిని పక్కన పెట్టడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఇటీవల బాలీవుడ్ అగ్రహీరో ఆమిర్ ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టారు. అందరిలానే ఆమిర్‌కు కూడా మహాభారత్ తెరకెక్కించాలన్నది చిరకాల కోరిక. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు మొదలు చూయాలని చూస్తుంటారు. అంతేకాకుండా ఆమిర్ ఒక సినిమా చేయాలనుకుంటేనే అది పూర్తయ్యేవరకు ఎంతో కష్టపడతారు. కానీ మహాభారత విషయంలో మాత్రం సినిమాను పక్కన పెట్టారంట. ఎందుకంటే ప్రస్తుతం ఆమిర్ మరో సినిమాలో నటించనున్నారు. అది కూడా భారీ బడ్జెట్ సినిమా అందుకనే ఆమిర్ మహాభారత్‌ను పక్కన పెట్టారంట. అంతేకాకుండా మహాభారత్‌ను వెబ్ సిరీస్ ప్రకారం తెరకెక్కించాలని చూస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాను ఇప్పుడున్న పరిస్థితుల్లో తీస్తే చాలా ఇబ్బంది అవుతుందనే ఆమిర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టారని తెలుస్తుంది. చూడాలి మరి మళ్ళీ ఈ ప్రాజెక్ట్ పై ఆమీర్ కు ఆశలు వస్తాయా… లేదా అనేది.

Related posts