telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సెల్ఫీ దిగుదామనుకున్న అభిమానిపై సల్మాన్ ఫైర్… ఫోన్ లాక్కుని…!

Salman-KHan

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ స‌ల్మాన్ ఇటీవ‌ల “ద‌బాంగ్-3” చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ప్ర‌స్తుతం రాధే చిత్రంతో పాటు క‌భీ ఈద్ క‌భీ దీవాళి చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. సల్మాన్ కు అభిమానుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఆయన ఎక్కడైనా కన్పిస్తే చాలు సెల్ఫీ దిగడానికి ఎగబడుతుంటారు. అయితే అప్పుడప్పుడు సల్మాన్ అభిమానులపై ఫైర్ అయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా గోవాలోని ప‌నాజీ విమానాశ్ర‌యంలో అభిమాని ప్ర‌వ‌ర్త‌నతో విసుగు చెందినట్టుగా క‌నిపించారు స‌ల్మాన్. ఎయిర్‌పోర్ట్ నుండి న‌డుచుకుంటూ వెళ్ళే స‌మ‌యంలో ఓ అభిమాని స‌ల్మాన్‌తో సెల్ఫీ దిగే ప్ర‌య‌త్నం చేశాడు. దీంతో విసుగు చెందిన స‌ల్లూ భాయ్ అత‌ని దగ్గ‌రి నుండి ఫోన్ లాగేసుకుని బ‌య‌ట‌కు న‌డుచుకుంటూ సీరియ‌స్‌గా వెళ్ళిపోయాడు. అయితే సెల్ఫీ దిగేందుకు ప్ర‌య‌త్నం చేసిన వ్య‌క్తి ఎయిర్‌పోర్ట్‌కి చెందిన గ్రౌండ్ స్టాఫ్ అని అంటున్నారు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌కి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

Related posts