ఏపీ టూరిజం మంత్రి రోజా నగరి నియోజకవర్గంలో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసేసరికి రోజా బాగా వెనుకబడ్డారు. ఆమె సమీప ప్రత్యర్థి, టీడీపీ నేత గాలి భానుప్రకాశ్ 5,640 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
రెండు రౌండ్లలో గాలి భానుప్రకాశ్ కు 12,267 ఓట్లు రాగా, మంత్రి రోజాకు కేవలం 6,627 ఓట్లు మాత్రమే వచ్చాయి.
రాష్ట్రం మొత్తమ్మీద రెండు రౌండ్ల లెక్కింపు అనంతరం టీడీపీ 127, వైసీపీ 22, జనసేన 17, బీజేపీ 7 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.