telugu navyamedia
ఆరోగ్యం వార్తలు

గుడ్‌న్యూస్‌.. భారత్ లో భారీగా తగ్గిన కరోనా కేసులు

Corona

భారత్ ప్రజలకి గుడ్ న్యూస్. ఇప్పుడు భారత్ లో కరోనా కేసులు చాలా వరకు తగ్గాయి. మొన్నటి వరకు భారీగా అంటే లక్ష దాకా వెళ్ళిన కరోనా కేసులు గత వారం రోజుల నుంచి తగ్గుముఖం పట్టాయనే చెప్పాలి. అయితే ఇప్పుడు భారీగా అంటే గత 24 గంటల్లో భారత్ లో కేవలం 60 వేల కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. నిన్నటితో పోలిస్తే దాదాపుగా పది వేల కేసులు ఒక్క రోజులో తగ్గాయని చెప్పచ్చు. గత 24 గంటల్లో 61, 267 కొత్తగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న 24 గంటల్లో 884 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇక నిన్నటి కేసులతో మొత్తం కేసుల సంఖ్య 66 లక్షల 85, 083కి చేరుకుంది.

 

ఇక ఇందులో 9,19,023 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటి దాక 56 లక్షల 62 వేల 491 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అలానే ఇప్పటి దాకా 1,03,569 మంది కరోనా బారిన పడి మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. సెప్టెంబరు 30 నుంచి వారం రోజుల వ్యవధిలో రోజువారీ సగటు కేసులు 93,000 నుంచి 83,000 వేలకు తగ్గాయని, ఇదే సమయంలో నిర్దారణ పరీక్షలు 1,15,000 నుంచి 1,24,000కు పెరిగాయని ఆర్ధిక శాఖ నివేదిక తెలిపింది. సెప్టెంబరు 17 నుంచి 30 మధ్య 14 రోజుల వ్యవధిలో నమోదయిన కేసుల వివరాలే దీనికి ఉదాహరణ అని ఆర్ధిక శాఖ నివేదిక తెలిపింది.

Related posts