telugu navyamedia
రాజకీయ వార్తలు

సరిహద్దులో అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యం: మోదీ

one nation one day salary slogan by modi

సరిహద్దులో అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం రోహ్‌తాంగ్‌ పాస్‌ వద్ద అటల్‌ టన్నెల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ అటల్‌ టన్నెల్‌ నిర్మాణం పూర్తి చేసి వాజ్‌పేయి స్వప్నాన్ని సాకారం చేశామని పేర్కొన్నారు.

సొరంగమార్గం అందుబాటులోకి రావడంతో కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. మనాలీ-లేహ్‌ మధ్య ప్రమాణానికి 3 నుంచి 4 గంటల సమయం ఆదా అవుతుందని తెలిపారు. ఢిల్లీ ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సమయం తగ్గుతుందని తెలిపారు. ఈ నిర్మాణంతో సరిహద్దులకు అదనపు బలం సైతం చేకూరుతుందని పేర్కొన్నారు. లద్దాఖ్‌లోని దౌలత్‌బాగ్‌ ఓల్డీలో మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. విమానాలు, హెలికాప్టర్లు దిగేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.

రహదారుల అనుసంధానం దేశ ప్రగతిలో ముఖ్యపాత్ర పోషిస్తుందని అన్నారు. ఎన్నోకష్టాలకు, వ్యయప్రయాసల కోర్చి టన్నెల్‌ను నిర్మించామని వెల్లడించారు. అతిఎతైన ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపొడవైన ఈ టన్నెల్‌ను ఎంతో వేగంగా నిర్మించాం. 26 ఏళ్లలో జరగాల్సిన పనిని కేవలం ఆరేండ్లలో పూర్తి చేశామని చెప్పారు.

Related posts