కోలీవుడ్ బిగ్ బాస్ రియాల్టీ షో ను కోర్టుకి వెళ్లి స్టే తీసుకుని అడ్డుకుని తీరుతానని నటి మీరా మిథున్ హెచ్చరిస్తోంది. ఈ సీజన్ బిగ్ బాస్ షోను కమల్ ఎంత అనుకున్నా సక్రమంగా జరపలేరని సవాల్ విసిరింది. తనకు సంబంధించిన ఓ వీడియోను కమల్ తన వద్ద దాచి పెట్టుకున్నారని, దాన్ని చూపిస్తూ, తనకు అవకాశాలు రాకుండా చేస్తున్నారని ఆరోపించింది. కాగా, మీరా మిథున్ తమిళ బిగ్ బాస్ సీజన్-3లో పాల్గొని వివాదాలకు కేంద్ర బిందువుగా మారిందన్న సంగతి తెలిసిందే. ఆ షోలో మరో కంటెస్టెంట్ గా ఉన్న దర్శకుడు చేరన్, తన నడుమును గట్టిగా పట్టేసుకుని గిల్లాడని సంచలన ఆరోపణలు చేయగా, ఆ వారాంతంలో కమల్ హాసన్, మీరా మిథున్ అబద్ధాలు చెబుతున్నదంటూ అసలు వీడియోను కమల్ ప్రేక్షకులకు చూపించారు. అప్పటి నుంచి కమల్ పై తన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. మీరా మిథున్ హెచ్చరికలను బిగ్ బాస్ టీవీ నిర్వాహకులు తేలికగా తీసుకుంటున్నారు.
previous post


తల్లి వ్యాఖ్యలపై వివాదంలో చిన్మయి