telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆంధ్రలో కంటే తెలంగాణలోనే ఆదర్శవంతమైన వ్యవసాయం చేస్తున్నారు..

prashant reddy trs

బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలంలోని కోమన్ పల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, భీంగల్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మరియు మెప్మా అద్వర్యం లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను నిన్న రాత్రి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఈ పరిస్థులల్లో రైతుకు ఎలాంటి ఇబ్బంది కలగ కూడదని,రైతు పండించిన పంటను వంద శాతం కొనుగోలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలో మొత్తం 444 కొనుగోలు కేంద్రాలు అందులో బాల్కొండ నియోజకవర్గంలో 100 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకుని ధాన్యం సేకరణకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నామన్నారు. రైతులను ఇబ్బంది పెట్టాలని చూసే రైస్ మిల్లర్లకు నా హెచ్చరిక…రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం. మిల్లులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ వాళ్లకు వరి పండించడం వచ్చా..దేశానికి మేమే అన్నం పెడుతున్నామని ఆంధ్రవాళ్లు ఎగతాళి చేసేవారని..కానీ ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచిందన్నారు.

దేశ వ్యాప్తంగా కేంద్రం ఎఫ్ సి ఐ ద్వారా సేకరించిన ధాన్యంలో తెలంగాణ నుంచే 50 లక్షల మెట్రిక్ టన్నుల పైచిలుకు ధాన్యం సేకరించామని పేర్కొన్నారు. అందులో ఆంద్రప్రదేశ్ నుంచి కేవలం 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే వచ్చిందని..ప్రగల్భాలు పలికిన వారికి అది చెంపపెట్టు అన్నారు. ఆంధ్రలో కంటే తెలంగాణ లోనే రైతులు ఆదర్శవంతమైన వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు.  రైతు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాలనేది న్యాయమైన డిమాండ్ అని..రైతు కష్టాలు తెలిచిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. పండించిన పంట 25 శాతం మాత్రమే కొంటాం అంటే మిగిలిన పంట రైతు ఏం చేస్తాడని…కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా రైతు పండించిన పంట వంద శాతం కొనుగోలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం అని గుర్తు చేశారు.

Related posts