telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పోతిరెడ్డిపాడు పెంచితే తెలంగాణకు చుక్కనీరు రాదు: ఉత్తమ్

uttam congress mp

పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచితే తెలంగాణకు చుక్క నీరు కూడా రాదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. అదే జరిగితే తెలంగాణ ఆరు టీఎంసీల నీటిని నష్టపోతుందని అన్నారు. ప్రాజెక్టు సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైందని అన్నారు.

ఆ ప్రాజెక్ట్ పనులు మొదలైతే సీఎం కేసీఆర్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచితే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా నాగార్జున సాగర్, పాలమూరు ఎత్తిపోతల, కల్వకుర్తికి . పోతిరెడ్డిపాడు టెండర్లను గత నెల 11నే ఆహ్వానించినట్టు తెలుస్తోందని చెప్పారు. అవి పూర్తికావాలన్న ఉద్దేశంతోనే అపెక్స్ కౌన్సిల్ భేటీని కేసీఆర్ వాయిదా వేశారని ఉత్తమ్ ఆరోపించారు.

Related posts