telugu navyamedia
తెలంగాణ వార్తలు

సీఎం కేసీఆర్‌తో హెచ్‌డీ కుమారస్వామి భేటీ

తెలంగాణ సీఎం కేసీఆర్ తో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి భేటీ ముగిసింది. ఆదివారం నాడు మధ్యాహ్నం హైద్రాబాద్ ప్రగతి భవన్ లో కుమారస్వామి కేసీఆర్ తో భేటీ అయ్యారు. మూడు గంటలకు పైగా కేసీఆర్ తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి చర్చించారు.

ఎన్డీఏ, యూపీఏ తరహా పీపుల్ ఫ్రంట్ అవశ్యకతపై.. కేసీఆర్ అభిప్రాయం వెల్లడించారు. తమతో కలిసి రావాలని కుమారస్వామిని కేసీఆర్ కోరారు. జాతీయ రాజకీయాల్లో కలిసి పనిచేసేందుకు.. కుమారస్వామి సుముఖత వ్యక్తం చేశారు.ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతిభవన్‌ కు వచ్చిన కుమారస్వామి.. రెండు గంటల పాటు చ‌ర్చించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తారని ప్రచారం సాగుతున్న తరుణంలో ఈ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని, పార్టీని కూడా ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ జిల్లా పార్టీల అధ్యక్షులు కోరారు.

కుమారస్వామి ప్రగతిభవన్ కు చేరుకోవడానికి ముందు ఓ హోటల్ లో కుమారస్వామితో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, రాజేందర్‌ రెడ్డి సమావేశమయ్యారు. కుమారస్వామితో కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ చేశారు. దేశంలో తాజా రాజకీయాలతో పాటు ఇతర పరిణామాలపై చర్చించారు

KCR NATIONAL POLITICS: ప్రగతి భవన్ కు కుమారస్వామి.. జాతీయ రాజకీయాలపై ఇద్దరు నేతల మధ్య చర్చ..?

అంతకు ముందు ప్రగతి భవన్‌కు చేరిన హెచ్‌డీ కుమారస్వామికి కేసీఆర్‌ సాదర స్వాగతం పలికి.. వెంట తోడుకొని వెళ్లారు. సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మధుసూదనచారి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, బాల్క సుమన్‌ తదితరులు ఉన్నారు.

Related posts