telugu navyamedia
రాజకీయ వార్తలు

ఎస్‌పీజీ భద్రత తొలగింపు.. పదేళ్లనాటి కార్లు కేటాయింపు!

soniya gandhi

కాంగ్రెస్‌ అధ్యక్షురాలుసోనియాగాంధీ కుటుంబానికి ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పీజీ) సెక్యూరిటీని ఇటీవల ఉపసంహరించిన కేంద్రం తాజాగా వారికి పాత వాహనాలను కేటాయించింది. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు బదులు 2010 మోడల్ టాటా సఫారీ వాహనాలను కేంద్రం కేటాయించింది. జడ్‌ ప్లస్ సెక్యూరిటీ కింద పదేళ్ల క్రితం నాటి వాహనాలను కేటాయించడంపై పార్లమెంటులో దుమారం చెలరేగింది. కాంగ్రెస్‌ ఎంపీ అధీర్‌ రంజన్‌ చౌదరి దీనిపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

ఎస్‌పీజీ భద్రతలో సోనియా కుటుంబానికి కమాండో స్థాయి అధికారులు రక్షణగా ఉండేవారు.. ఇప్పుడు జడ్‌ప్లస్ సెక్యూరిటీలో వందమంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మాత్రమే రక్షణగా ఉంటారు. సోనియా కుటుంబానికి బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించాలని కోరినప్పటికీ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదని తెలుస్తోంది. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య తర్వాత సోనియా కుటుంబానికి ఎస్‌పీజీ భద్రత కల్పించారు.

Related posts