తెలంగాణ పీసీసీ చీఫ్ గా మహేశ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవీకాలం గత జులై 7వ తేదీతో ముగిసింది.
దీంతో ఆయన స్థానంలో అధ్యక్ష పదవికి పలువురు సీనియర్ నేతలు పోటీ పడ్డారు. ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పోటీ పడ్డారు. అధిష్ఠానం మహేశ్ కుమార్ గౌడ్ వైపు మొగ్గు చూపింది.