‘అల వైకుంఠపురములో’ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ సాధించి, నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ ఛేసిన అల్లు అర్జున్, తాజాగా చేస్తున్న ‘పుష్ప’ చిత్ర ఫస్ట్‌లుక్‌తోనే రికార్డుల పరంపరకు శ్రీకారం చుట్టారు. అల్లు అర్జున్, సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో, మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న క్రేజీ ప్యాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్‌ను అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా ఏప్రిల్ 8న విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో రికార్డులను క్రియేట్ చేసినట్లుగా చిత్రయూనిట్ ప్రకటించారు. అల్లు అర్జున్ రఫ్ లుక్‌లో ఉన్న ఈ పోస్టర్‌ను బన్నీ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ 24 గంటలలో 84 వేల ప్లస్ లైక్స్‌ను సొంతం చేసుకుంది. అయితే ఇప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో.. విడుదలైన 24 గంటలలో ఏ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇన్ని లైక్స్ సాధించలేదని, ‘పుష్ప’ ఫస్ట్ లుక్ పోస్టర్ సాధించి రికార్డ్‌ను క్రియేట్ చేసిందని చిత్రయూనిట్ అఫీషియల్‌గా ప్రకటించారు.
previous post
next post
“అరే పవన్” అంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు