భువి పై మరే ఏ మానవ రూపం కి సాద్యం కాని… అసాధారణ చరిత్ర పుటలను మరిచిపోలేని జ్ఞాపకాలు మనకు మిగిల్చి వెళ్ళిన రోజు కోటి జన్మల పుణ్యఫలమైన ఈ రూప దర్శనం తెలుగు నేలను విడిచింది నేడే.
దైవాంశ సంభూతుడు దర్శనం ఈ గడ్డ మీద తిరిగి ప్రారంభం అయ్యేది ఎప్పటికో ప్రతి రోజూ ప్రతి క్షణం ఈ సుందర రూపాన్ని చూసై చాలు కనుల పండుగ మాకు .
ఓ యుగ పురుషుడా కోటి జన్మలు ఎత్తినా నీ లాంటి యోధుడు మరల వెలసేనా ఈ పుడమి పై ప్రతి దినం నిన్ను చూడని మా నేత్రములు వృదా నిన్ను తలవని క్షణాలు వ్యర్థం మహానుభావా జన్మించి 102 ఏళ్ళు
నిష్క్రమించి 29 ఏళ్ళు .
తెలుగు జాతి… ఇసుమంతైనా మరువలేదు నిన్ను ప్రతి క్షణం పెరుగుతుంది మీపై అభిమానం ఎలా సాధ్యం అయింది తండ్రి ఈ జీవనం ప్రతి తెలుగోడి గుండెల్లో గుడి కట్టించుకున్న ఓ నందమూరి తారక రాముడా నీ తలపే మాకు శ్రీరామ రక్ష .
దారపనేని నరేంద్రబాబు
మీడియా కోఆర్డినేటర్
తెలుగుదేశం పార్టీ