telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆసక్తికరంగా తాప్సి “త‌ప్ప‌డ్” ట్రైలర్

Taapsee

మిల్కీ బ్యూటీ తాప్సీ పింక్‌, బాద్లా వంటి సోష‌ల్ చిత్రాల‌తో పాటుభారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం “శభాష్ మిథు” పేరుతో తెరకెక్కుతున్న మిథాలీ రాజ్ బయోపిక్ లో నటిస్తోంది. ఇక ‘సాండ్‌ కీ ఆంఖ్‌’, ‘రష్మి రాకెట్‌’ వంటి మహిళా ప్రాధాన్య చిత్రాల్లో నటించింది. తాజాగా ముల్క్ దర్శకుడు అనుభవ్‌ సిన్హా, తాప్సి కాంబినేషన్‌లో మరో మహిళా ప్రాధాన్య చిత్రం “త‌ప్ప‌డ్” అనే టైటిల్‌తో రూపొందుతోంది. ప‌వైల్ గులాటీ ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రంలో మ‌హిళా స‌మ‌స్య‌ల‌ని చూపించ‌నున్నారు. మహిళల స‌మ‌స్య‌ల‌పై చిత్రం రూపొందుతోంది. మహిళలు ఒక నిర్థిష్టమైన దానికే ఎందుకు కట్టుబడి ఉండాలన్న దానిపై ఈ చిత్రం ద్వారా ప్రశ్నించ‌నున్నారు. చిత్రంలో తాప్సీ అమృత అనే సాధార‌ణ మ‌హిళ పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఫిబ్ర‌వ‌రి 28న విడుద‌ల కానున్న ఈ చిత్ర ట్రైల‌ర్ తాజాగా విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్ ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంటుంది.

Related posts