telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ గూండాలు రైతులపై దాడులు: లోకేష్

Minister Lokesh comments YS Jagan

వైసీపీ గూండాలు రైతులపై విచక్షణారహితంగా దాడులు చేశారని మాజీ మంత్రి, టీడీపీ నేత లోకేష్ అన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ ప్రజలను ఒప్పించలేని వాడే దాడులకు తెగబడతాడంటూ సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మూడు రాజధానుల నిర్ణయంలో తన స్వార్థం ఉందన్న విషయం ప్రజలకు అర్థమైపోయిందనే ఆందోళన జగన్‌ని వెంటాడుతోందన్నారు.

రైతులపై దాడి చేయించి జగన్.. రైతు ద్రోహిగా మారాడని వ్యాఖ్యానించారు అందుకే వైసీపీ రైడీలను రంగంలోకి దించారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాంతియుతంగా దీక్షలు చేస్తుంటే శిబిరానికి నిప్పుపెట్టారంటూ తెనాలి ఘటనను ఉటంకిస్తూ లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Related posts