ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మరోసారి నిప్పులు చెరిగారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడానికి నాలుగేళ్లలో ఎన్నిచేయాలో అన్ని చేశారని రోజా ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ… దొంగల్ని, ఆర్థిక నేరగాళ్లను కాపాడే అడ్డాగా ఆంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌ను కూడా గౌరవించను అంటున్నారంటే చంద్రబాబును ఏమనాలని ప్రశ్నించారు. 100 శాతం వైఎస్ జగన్‌పై హత్యాయత్నం చంద్రబాబే చేయించారనడానికి, ఆయన మాటలే నిదర్శనమన్నారు.
ఇదంతా ఆపరేషన్ గరుడ అని సినిమాలు లేని శివాజీ అనే నటుడితో చెప్పించారని ఆరోపించారు.చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మహిళను కాకినాడలో పట్టుకుని ఫినిష్ చేస్తానని గూండాలా బెదిరించారు. అసెంబ్లీలో కూడా చాలాసార్లు ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తానని బెదిరించారు. కేంద్ర పరిధిలో ఉన్న ఎయిర్ పోర్టులో జగన్ ను హత్య చేస్తే నేరం కేంద్రంపైకి పోతుందని చంద్రబాబు ప్లాన్ చేశారు. ఎన్‌ఐఏ విచారణకి నిందితుడు శ్రీనివాస్‌కు లేని బాధ చంద్రబాబు, లోకేష్‌కు ఎందుకు అని రోజా ప్రశ్నించారు.
టీటీడీ బోర్డును సీబీఐ ఛార్జ్ షీట్ లా చేశారు: అనురాధ ఫైర్