telugu navyamedia
వార్తలు సామాజిక

త్వరలోనే కొత్త రూ.100, రూ.200 నోట్లు ప్రకటన చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా సంతకంతో కూడిన రూ.100, 200 కరెన్సీ నోట్లు త్వరలో మార్కెట్లోకి విడుదల కానున్నాయి.

కొత్త నోట్ల డిజైన్‌ ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లోని రూ.100, 200 నోట్లను అన్ని విధాలుగా పోలి ఉంటాయని ఆర్‌బీఐ మంగళవారం వెల్లడించింది.

అంతేకాదు, ప్రస్తుతం మార్కెట్లో చలామణి అవుతున్న రూ.100, 200 నోట్లు యధావిధిగా చెల్లుబాటవుతాయని స్పష్టం చేసింది.

Related posts