telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ సామాజిక

అమర్‌నాథ్ యాత్రలో .. విషాదం.. కడప వాసి మృతి..

disciple died in amarnadh yatra from kadapa

ఎన్నో వ్యయప్రయాసలతో కూడిన అమర్‌నాథ్ యాత్రకు వెళ్లడం అంటే అన్నిటికి సిద్ధం అయితేనే వెళతారు. అయినా అందరిని సురక్షితంగా తీసుకెళ్లి, తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ .. చెదురుమొదురు ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా యాత్రలో సంభవించిన ప్రమాదంలో కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన భాగ్యమ్మ మృతి చెందింది. బల్తాల్ బేస్ క్యాంపులో ఆమె గుండెపోటుతో మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. రేపు ఆమె మృతదేహాన్ని విమానంలో కడప పంపనున్నట్టు అమర్‌నాథ్ బోర్డు అధికారులు తెలిపారు.

అమర్‌నాథ్ యాత్రికుల్లో 15 మంది ఆక్సిజన్ అందక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ఇండో-టిబెటిన్ బోర్డర్ పోలీసులు (ఐటీబీపీ) ఆక్సిజన్ అందించి ప్రాణాలు కాపాడారు. అమర్‌నాథ్ యాత్ర సాఫీగా సాగుతున్నట్టు ఐటీబీపీ తెలిపింది. 46 రోజులపాటు సాగనున్న అమర్‌నాథ్ యాత్ర ఈ నెల 1న ప్రారంభమైంది. ఆగస్టు 15న శ్రావణ పూర్ణిమతో ముగుస్తుంది.

Related posts