బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగణ్ కూతురు నైసా వయసు 17 ఏళ్లు. చిన్న వయసులోనే నైసా వేసుకునే దుస్తులు, మేకప్ వల్ల సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంటుంది. తాజాగా నైసా గుడికి వేసుకున్న దుస్తులపై బాలీవుడ్లో హాట్ చర్చ జరుగుతోంది. గురువారం నైసా తన తండ్రితో కలిసి ముంబయిలోని ఓ ఆలయానికి వెళ్లింది. సాధారణంగా సామాన్యులైనా, సినీ ప్రముఖులైనా గుడికి వెళ్లేటప్పుడు కాస్త సంప్రదాయమైన దుస్తులు వేసుకుని వెళుతుంటారు. అయితే నైసా మాత్రం ఏకంగా అల్ట్రా మోడరన్ డ్రెస్ లో వెళ్లింది. లోపల వేసుకునే క్రాప్ టాప్ వేసుకుని ఆలయానికి వెళ్లడంతో నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. తన పిల్లల జోలికి రావొద్దని అజయ్ ఎప్పుడో నెటిజన్లకు వార్నింగ్ ఇచ్చారు. తన పిల్లలు ఇద్దరూ ఇంకా చిన్నవారేనని, కావాలంటే తనను, కాజోల్‌ను ఏమైనా అనండి కానీ తన పిల్లల జోలికి మాత్రం రావద్దని తెలిపారు. గతంలోనూ నైసా తొడల వరకు ఉన్న స్వెటర్ వేసుకుని ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లడం వైరల్ అయింది. దాంతో ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా అని నెటిజన్లు ఆమె ఫొటోలను షేర్ చేస్తూ ఎగతాళి చేశారు.
previous post
అమ్మాయిలు రేప్ కు సహకరించాలి… దర్శకుడి సంచలన వ్యాఖ్యలు