కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు త్వరలోనే ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలకు ముఖ్యమంత్రి యడియూరప్ప కీలక ఆదేశాలను జారీ చేశారు. అభ్యర్థుల ఎంపికపై ఏ ఒక్కరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని ఆదేశించారు.టికెట్ల కేటాయింపులో పార్టీ హైకమాండ్ దే తుది నిర్ణయమని యడియూరప్ప స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికపై కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారాయని చెప్పారు.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను పార్టీ అధిష్ఠానం గమనిస్తోందని హెచ్చరించారు. అనర్హత ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడేంత వరకు అందరూ ఓపిక పట్టాలని సూచించారు. అనర్హత ఎమ్మెల్యేలకు సంబంధించి కాంగ్రెస్ విడుదల చేసిన ఆడియో ప్రభావం ఉపఎన్నికలపై ఏమాత్రం ఉండదని పేర్కొన్నారు.


మంత్రి పదవి కావాలని అడగలేదు: ఎమ్మెల్యే రోజా