telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఇక ఆర్టీసీ కథ ముగియనుంది..కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

KCR cm telangana

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మె ముగియడం కాదని, ఇక ఆర్టీసీనే ముగుస్తుందని వ్యాఖ్యానించారు. యూనియన్‌ ఎన్నికల ముందు చేస్తున్న పనికిమాలిన సమ్మె ఇదని ఆయన చెప్పారు. మూడునాలుగేళ్లకు ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ గొంతెమ్మ కోరికలు కోరే చిల్లర రాజకీయాలు ఇవని మండిపడ్డారు. ఇక ఆర్టీసీని ఎవరూ కాపాడలేరని, అయిపోయిందని.. ఆర్టీసీ దివాళా తీసిందని సీఎం వ్యాఖ్యానించారు.

ఆర్టీసీ తమ వకీళ్లను పెట్టి పచ్చి అబద్ధాలు చెబుతోందని, కార్మికుల పీఎఫ్ సొమ్మును ప్రభుత్వం తీసుకుంటుందా? ఎవరూ తీసుకోలేదని స్పష్టం చేశారు. నెలకు ఆర్టీసీకి 100 కోట్లకు పైగా నష్టం వస్తోందని చెప్పారు. ఆర్టీసీ బస్సులకు రోజుకు రూ.3 కోట్లు నష్టం వస్తోందని, ప్రైవేట్‌ బస్సులకు మాత్రం రూ.4 లక్షల లాభం వస్తోందని ఆయన తెలిపారు. హైదరాబాద్ లో ఎన్ని ట్రావెల్స్ సంస్థల బస్సులు నడుస్తాయి? జబ్బార్ ట్రావెల్స్, కేశినేని ట్రావెల్స్, దివాకర్ ట్రావెల్స్, గంగినేని ట్రావెల్స్.. అవి లాభాల్లో ఎలా ఉంటాయి? ఆర్టీసీ ఏమో మునుగుతుందా? ఈ విషయం తనకు అర్థం కావడం లేదని కేసీఆర్ అన్నారు.

Related posts