తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన బోటును బయటకు తీసినట్లు తెలుస్తోంది. ధర్మాడి సత్యం టీమ్ ఈ ఆపరేషన్‌ను సక్సెస్ చేసింది. బోటును సత్యం టీమ్ నీళ్లపైకి తెచ్చింది. నీటి అడుగుభాగం నుంచి రోప్‌ల సాయంతో వెలికితీశారు. మరికాసేపట్లో బోటును ధర్మాడి సత్యం ఒడ్డుకు తీసుకురానున్నారు. అయితే వశిష్ట బోటు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో బోటుకు సంబంధించిన విడిభాగాలను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాగా సెప్టెంబర్ 15న కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునిగిన సంగతి తెలిసిందే.
previous post


అమృతే రాసినా, పనిలేని వాడు రాసినా ‘మర్డర్’ విషయంలో నా ఆలోచన నాది : ఆర్జీవీ