బాలీవుడ్ హీరోలు అజయ్ దేవగణ్, సైఫ్ కలిసి నటిస్తున్న చిత్రం “తానాజీ : ది అన్సంగ్ వారియర్”. మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ సైన్యంలో సేనాధిపతిగా ఉన్న సుబేదార్ తానాజీ మలుసరే జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది . భారత చరిత్రలో కీర్తించని యుద్ధవీరుడు సుబేదార్ తానాజీ మలుసరే. తన ప్రజలు, తన నేల తల్లి, తన రాజు ఛత్రపతి శివాజీ కోసం ఎంతగానో పోరాడారు తానాజీ. ఆయన జీవిత నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఓమ్ రౌత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తున్న అజయ్ దేవగణ్ ఈ సినిమాను ‘బాహుబలి’ కన్నా గొప్ప స్థాయిలో చేయాలని అనుకుంటున్నామని తెలిపాడు. 3డీ వర్షెన్‌లో విడుదల కానున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. ఇందులో అజయ్ దేవగణ్, సైఫ్ అలీఖాన్ ఆసక్తి రేకెత్తిస్తుంది. అజయ్ దేవగణ్ టైటిల్ పాత్రలో నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అజయ్‌దేవగణ్, భూషణ్ కుమార్, కృష్ణకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్నివచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం విడుదల చేయనున్నారు. ముందుగా ఈ చిత్రానికి తానాజీ అనే పేరు ఫిక్స్ చేశారు. కాని న్యూమరాలజీ ప్రకారం తానాజీ అనే టైటిల్ తన్హాజీగా మార్చారని అప్పట్లో టాక్ వినిపించింది.
previous post