telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నా బాయ్ ఫ్రెండ్‌తో నా రిలేషన్ బాగానే ఉంది… : తాప్సి

Taapsee

మిల్కి బ్యూటీ తాప్సీ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. మంచి ఆఫర్స్ ఎంచుకుంటూ తనదైన శైలిలో బాక్సాఫీస్ హిట్స్‌ని అందుకుంటోంది. అలాగే ఆమె ఎంచుకుంటోన్న కథలు కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటున్నాయి. తాజాగా తన పెళ్లి, పిల్లలు, బాయ్‌ ఫ్రెండ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది తాప్సీ. ఇది వరకే తనకు ఓ సీక్రెట్ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడన్న విషయాన్ని బయటపెట్టిన తాప్సీ.. అతని వివరాలు మాత్రం బయట పెట్టలేదు. ప్రస్తుతం తన ఏకాగ్రత అంతా కెరీర్‌ మీద మాత్రమే ఉందని.. ఎవరెన్ని రూమర్స్ క్రియేట్ చేసినా నేను పట్టించుకోనని పేర్కొంది. ఇక పెళ్లి, ప్రేమ వ్యవహారం అనేది పూర్తిగా నా పర్సనల్ విషయం. ఇంతకు ముందే నా లవర్‌ గురించి చెప్పాను. మాకు పిల్లలు కావాలనుకున్నప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. ఇక నా బాయ్ ఫ్రెండ్‌తో నా రిలేషన్ బాగానే ఉంది. అతను నన్ను చాలా బాగా చూసుకుంటాడు అనే నమ్మకం నాకు ఉందంటూ చెప్పుకొచ్చింది తాప్సీ.

Related posts