యంగ్ హీరో గోపిచంద్ హీరోగా తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో “చాణక్య” అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన మెహరీన్, జరీన్ ఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తైంది. ఇండో – పాక్ బోర్డర్ లో వచ్చే సన్నివేశాలు, అలాగే సెకెండ్ హాఫ్ లోని కీలక సన్నివేశాలు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. ఇటీవలే ఈ చిత్రం నుంచి టీజర్ విడుదలైంది. ఈ టీజర్ లో గోపీచంద్ లుక్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు గోపీచంద్. ఈ మూవీ అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర ప్రమోషన్లో భాగంగా మేకింగ్ వీడియో విడుదల చేశారు మేకర్స్. ఇందులోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. మీరు కూడా ఈ మేకింగ్ వీడియోను వీక్షించండి.
previous post
next post
అన్నయ్య సినిమాలు వరుణ్ రీమేక్ చేస్తే పెద్ద సవాలే..!