‘సరిలేరు నీకెవ్వరు’తో మహేష్ బాబు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో మహేష్ తదుపరి సినిమా ఉండబోతుందనే వార్తలు రావడంతో పాటు, పరశురామ్ కూడా ఇటీవల ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేయడంతో పక్కాగా మహేష్ బాబు మూవీ పరశురామ్‌తోనే ఉంటుందని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే అంతకుముందు సుకుమార్, వంశీ పైడిపల్లితో సినిమాలు కన్ఫర్మ్ అయ్యి కూడా చివరి నిమిషంలో ఆగిపోయాయి. తాజాగా అఫీషియల్‌గా ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు 27వ చిత్రం ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్‌తోనే అని తెలుపుతూ.. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు అనగా మే 31వ తేదీన ఉదయం 9 గంటల 9నిమిషాలకు ఉండబోతుందని చిత్రయూనిట్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లలో రూపుదిద్దుకోనునుంది.
#SSMB27 Official Announcement 🥁
You’ve been hearing a lot about it, countdown begins to see the REAL thing 😊
31st May – 9.09 AM 🌠
Super ⭐ @urstrulyMahesh @ParasuramPetla @MythriOfficial @GMBents @14ReelsPlus pic.twitter.com/F1Qo4PuJVl
— GMB Entertainment (@GMBents) May 30, 2020
లవ్ ఫెయిల్యూర్ గురించి స్పందించిన నయనతార…