ఇటీవల కాలంలో దక్షిణాది సినిమాలు బాలీవుడ్లో ఎక్కువగా రీమేక్ అవుతున్నాయి. మరోవైపు బాలీవుడ్ సినిమాలు కూడా దక్షిణాదిన రీమేక్ అవుతున్నాయి. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన “అంధాధున్” సినిమాను దక్షిణాది భాషల్లోకి రీమేక్ చేసేందుకు ప్రయ్నతాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన ఆయుష్మాన్ ఖురానాకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు కూడా వచ్చింది. తమిళంలో ప్రశాంత్ హీరోగా ఈ సినిమా రీమేక్ అవుతోంది. తెలుగులో కూడా ఈ సినిమా రీమేక్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేచురల్ స్టార్ నాని ఈ సినిమాపై ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. కాగా.. ఇప్పుడు ఆయుష్మాన్ ఖురానా హీరోగా రూపొందిన మరో చిత్రం “డ్రీమ్ గర్ల్” భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని కూడా తెలుగులో రీమేక్ చేయబోతున్నారని టాక్. ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు ఈ చిత్రానికి సంబంధించిన రీమేక్ హక్కులను పొందారట. ప్రస్తుతం తెలుగు నెటివిటీకి సంబంధించినట్లు మార్పులు, చేర్పులు జరుగుతున్నాయట. ఈ రీమేక్‌లో రాజ్‌తరుణ్‌ని నటింప చేయాలని సురేష్ బాబు అనుకుని సంప్రదిస్తే.. తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి.
నా తొడమీద పుట్టుమచ్చ చూసి చాలామంది పడిపోయారు… “నగ్నం” హీరోయిన్