telugu navyamedia
సినిమా వార్తలు

సంగీత దర్శకుడు హీరోగా హార్రర్ థ్రిల్లర్ “హేజా”

Heza

సంగీత దర్శకుడు మున్నా కాశీ దర్శకత్వం వహిస్తూ హీరోగా చేసిన చిత్రం “హేజా”. “మిస్టర్ 7, యాక్షన్ 3D, చిత్రం చెప్పిన కథ, మామ ఓ చందమామ” చిత్రాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు మున్నా కాశీ. ముమైత్ ఖాన్, నూతన్ నాయుడు, లిజి గోపాల్, ప్రీతం నిగమ్ కీలక పాత్రల్లో పోషించారు. మ్యూజిక్ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రంతో చాలా రోజుల తర్వాత నటి ముమైత్ ఖాన్ రీ ఎంట్రీ ఇస్తోంది. విఎన్‌వి క్రియేషన్స్ పతాకంపై కెవిఎస్ఎన్ మూర్తి ఈ చిత్రాన్ని నిర్మించారు. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీని అందించారు. హారర్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ చివరిదశలో ఉండగా చిత్ర బృందం శనివారం టీజర్‌ని విడుదల చేసింది.


ఈ సందర్భంగా దర్శకుడు, హీరో మున్నా కాశి మాట్లాడుతూ “ఇప్పటి వరకు చాలా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశాను. ఫస్ట్ టైం హీరోగా, దర్శకుడిగా మారి చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకి సపోర్ట్ చేసిన అందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాతో ముమైత్ ఖాన్‌గారు రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన సినిమా అవుట్‌ఫుట్ చాలా బాగా ఉంది. ఈ సినిమా అందరినీ తప్పకుండా మెప్పిస్తుంది” అన్నారు.

నిర్మాత కెవిఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ “ఇప్పటి వరకు వచ్చిన అన్ని హారర్ సినిమాల కంటే డిఫరెంట్‌గా ఈ సినిమా ఉండబోతోంది. దర్శకుడు ఎంతో క్లారిటీగా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా సినిమా చేశారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలో అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి విడుదల చేస్తాం” అన్నారు.

Related posts