అసెంబ్లీ సమావేశాల ఆఖరిరోజు కేసీఆర్ ఘాటుగా ప్రసంగించారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చినం. కొత్త చట్టం పట్ల కఠినంగా ఉంటం. సర్పంచ్‌లకు జాయింట్ చెక్‌పవర్ కొనసాగుతది. ఉప సర్పంచ్‌లను కలుపుకొని తీసుకుపోవాలని సర్పంచ్‌లను కోరినం. టీఆర్‌ఎస్ నుంచి ఎక్కువ మంది సర్పంచ్‌లు ఎన్నికయ్యారు. సర్పంచ్‌లను తొలగించే సమయంలో మంత్రులకు ఉన్న స్టే పవర్‌ను తీసేసినం. సర్పంచ్‌ల విషయంలో కలెక్టర్‌లకు విశేష అధికారాలు ఇచ్చినం. రెవెన్యూ శాఖలో అవకతవకలు ఎవరి పుణ్యం. వీఆర్‌వోలను మేం తీసేస్తామని చెప్పినమా అని ప్రశ్నించారు. వీఆర్‌వోలను తొలగించాల్సి వస్తే తొలగిస్తం. పటేల్, పట్వారీ వ్యవస్థలు పోలేదా అని అడిగారు.
భారత దేశం ఆశ్చర్యపోయే విధంగా అద్భుతమైన రెవెన్యూ చట్టం తెస్తం. నూతన రెవెన్యూ చట్టాన్ని త్వరలోనే తీసుకువస్తామని వెల్లడించారు. మేం రైతుల కోసం పనిచేస్తున్నం. రైతులకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది రానివ్వం. కౌలుదారులను మా ప్రభుత్వం గుర్తించదు. అది రైతులకు … కౌలుదారులకు మధ్య సంబంధం. ఈ ఏడాది ఆర్థిక మాంద్యం తీవ్రంగా ఉంది. అన్ని రంగాల్లో మాంద్య ప్రభావం ఉంటుంది. పన్నులు పెంచే, తగ్గించే అధికారం మాకు లేదు. కేంద్రం నుంచి పన్నుల వాటా రావాలి. కేంద్రం కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించింది. ఆ మేరకు రాష్ర్టాల వాటా తగ్గుతుందని తెలిపారు.
సుప్రీంకోర్టు తీర్పు కేంద్రానికి చెంపపెట్టు: సాధినేని యామిని