భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాల్లోకెళ్తే.. పినపాక మండలం, ఏడూళ్లబయ్యారం గ్రామానికి చెందిన చిన్నిస్వామి(22), ఓ యువతి గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమను పెద్దలు అర్థం చేసుకోలేదు.
చాలా సార్లు వారిని ఇరు కుటుంబాలు వారించగా.. వారు తమ పెళ్లిని కూడా ఖచ్చితంగా అడ్డుకుంటారని భావించిన ఆ ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. విషయాన్ని గమనించిన స్థానికులు వారిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా.. యువకుడు చిన్నిస్వామి అప్పటికే మంరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. అమ్మాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
సీఎం జగన్ కు దెయ్యం పట్టింది: పంచుమర్తి అనురాధ