పాక్ కు చెందిన అక్విబ్ పెర్వైజ్ (27) కుటుంబంతో కలిసి ఉద్యోగ రీత్యా యునైటెడ్ కింగ్డం(యూకె)లో నివసిస్తున్నాడు. అయితే తన భార్యతో తన సహోద్యోగి నదీముద్దీన్ హమీద్ మొహమ్మద్‌కు వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. కొన్ని రోజుల క్రితం.. ఓ సూపర్మార్కెట్లోని సెల్లార్లో హమీద్‌పై కత్తితో దాడికి పాల్పడి హత్య చేశాడు.
ఈ కేసుపై విచారించిన బ్రిటన్‌లోని ఓ న్యాయస్థానం తాజాగా అక్విబ్కి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. హమీద్ భారత్‌లోని హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి.