వర్జీనియాలోని పిట్సిల్వేనియా కౌంటీలో ఉండే 19 ఏళ్ల మాథ్యూ బెర్నార్డ్ అనే యువకుడు మంగళవారం అతి కిరాతకంగా తల్లి, సోదరి, మేన కోడలితో పాటు పెంపుడు కుక్కను ఇంట్లోనే చంపేశాడు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు 911 కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు మంగళవారం మధ్యాహ్నం బెర్నార్డ్ను అరెస్ట్ చేసేందుకు అతడి ఇంటికి వెళ్లారు. అదే సమయంలో మీడియా కూడా అక్కడికి వెళ్లడం… ఈ సంఘటనను వీడియో తీయడం జరిగింది. ఇక పోలీసులు రావడం గమనించిన అతడు ఒంటిపై నూలు పోగు లేకుండా బయటకు పరుగు అందుకున్నాడు. అతడ్ని పట్టుకునేందుకు యత్నించిన పోలీసుల వైపు కూడా పరిగెత్తాడు. ఆ తరువాత ఓ వాహనం వద్ద నిలబడిన వ్యక్తిని అడ్డం పెట్టుకొని పోలీసులను బెదిరించే ప్రయత్నం చేయడం వీడియోలో రికార్డైంది. దీంతో పోలీసులు అతడ్ని వెంబడించారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బెర్నార్డ్ ప్రయత్నించడం… చివరకు పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ తరువాత అతడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వార్తల్లో రావడంతో అది కాస్తా వైరల్గా మారింది.
previous post