అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ విచిత్ర ఘటన మే నెలలో జరిగింది. ఏరియల్ మచన్-లే క్వైర్(25) అనే యువతి తన బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ సెల్మన్స్(22)తో కలిసి కారులో వెళ్తుండగా షార్లెట్ కౌంటీ పోలీసులు వారిని ఆపారు. అనంతరం ఆ జంటతో మీ వాహనాన్ని తనిఖీ చేయాలని రోడ్డు పక్కకు తీసుకెళ్లారు. ఆ సమయంలో తాము కప్పలు, పాములు పడుతుంటామని పోలీసులతో చెప్పిందా జంట. తీరా తనిఖీ చేస్తే వాహనంలో అరుదైన జాతికి చెందిన 41 తాబేళ్లు దొరికాయి. కారును పూర్తిగా సోదా చేసిన తరువాత ఇంకా మీ వద్ద ఏమైనా ఉన్నాయా? అని ఆ జంటను పోలీసులు అడిగారు. మొదట మైఖేల్ సెల్మన్స్ను సోదా చేసిన పోలీసులకు అతడి వద్ద ఏమీ దొరకలేదు. అనంతరం మచన్-లే క్వైర్ను అడిగారు పోలీసులు. దాంతో ఆమె తన ప్యాంటులోంచి చిన్న మొసలి పిల్లను తీసి పోలీసులకు ఇచ్చింది. దీంతో పోలీసులు షాక్. వెంటనే మొసలి పిల్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆమెపై జంతువుల అక్రమ రవాణా కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు.
previous post
next post
ఏపీ సీఎం పై జేపీ నేత లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు…