telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

డబ్బు కోసం ఆ దంపతుల నీచమైన పని…!

Fake

పెన్సిల్వేనియాకు చెందిన కేసీ లాంగ్, జెఫ్రీ లాంగ్‌ అనే దంపతులు డబ్బు కోసం చేసిన నిర్వాకం తెలుసుకున్న పోలీసులు వారిని కటకటాల్లోకి నెట్టారు. కొన్ని నెలల క్రితం కేసీ లాంగ్ తన ఫేస్‌బుక్ పేజీ ద్వారా తాను గర్భవతినంటూ ఓ ఫొటో పోస్ట్ చేసింది. అది చూసిన జాన్స్‌టౌన్‌లోని కేసీ లాంగ్ ఓ స్నేహితురాలితో పాటు ఆమె తాతయ్య కూడా పుట్టబోయే బిడ్డ కోసం కొన్ని వస్తువులు కొనిచ్చారు. కానీ ఆ తరువాత ఆమె ఎప్పుడూ తన ప్రెగ్నెన్సీ గురించి ఎక్కడ చర్చించలేదు. ఉన్నట్టుండి జూలై 13న లాంగ్ దంపతులు తమకు కోన్మాగ్ హెల్త్ సెంటర్‌లో కొడుకు ఈస్టన్ వాల్ట్ లాంగ్ పుట్టినట్టు పేర్కొన్నారు. కాని ఆ సంతోషం ఎంతోసేపు నిలువలేదని, బాబు పుట్టిన కొన్ని గంటలకే ఆరోగ్య సమస్యలతో మృతి చెందినట్టు తెలిపారు. వారి వద్ద ఉన్న ఓ బొమ్మ ఫొటోను ఫేస్‌బుక్ పేజీలో పెట్టారు. అది చూసిన బంధువులు, స్నేహితులు దంపతులకు సహాయంగా బాబు అంత్యక్రియల కోసం కొంత నగదును కూడా ఏర్పాటు చేశారు. అలాగే లాంగ్ దంపతుల ఆర్థిక పరిస్థితి గురించి తెలిసిన ఓ బంధువు సోషల్ మీడియా వేదికగా ‘గోఫండ్‌మీ’ పేరిట ప్రచారం చేసి 550 డాలర్లు (సుమారు రూ.39వేలు) పోగు చేశారు. అయితే కొన్ని రోజుల తరువాత దంపతుల వ్యవహారశైలిపై అనుమానం వచ్చిన సింథియా డిలాసియో అనే స్నేహితుడు జాన్స్‌టౌన్ పోలీసులకు వారిపై ఫిర్యాదు చేశాడు. డిలాసియో ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసీ, జెఫ్రీ లాంగ్ ఇంట్లో సోదా చేశారు. ఆ సమయంలో పోలీసులకు ఇంట్లో ఓ బొమ్మ దొరికింది. ఆ బొమ్మ ఫొటోనే వారు తమకు పుట్టిన బిడ్డ ఈస్టన్ అని, జన్మించిన కొన్ని గంటలకే చనిపోయాడంటూ సోషల్ మీడియాలో పెట్టారు. దాంతో లాంగ్ దంపతులపై దొంగతనం, మోసం కింద కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు. అనంతరం బాబు అంత్యక్రియల కోసమని మోసపూరితంగా ‘గోఫండ్‌మీ’ ద్వారా సేకరించిన రూ. 39 వేలను పోలీసులు తిరిగి దాతలకు ఇచ్చేశారు.

Related posts