దేశ రాజధాని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో అగ్నిప్రమాదం సంభవించింది. ఆస్పత్రిలోని మొదటి అంతస్తులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఎమర్జెన్సీ విభాగంలోని మొదటి, రెండో అంతస్తుల్లో పొగలు దట్టంగా అలుముకున్నాయి. వ్యాపించిన పొగతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రి సిబ్బంది రోగులను మరో బ్లాక్‌లోకి తరలించేందుకు చర్యలు చేపట్టారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 34 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్రం చేస్తున్నారు. కాగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఆస్పత్రిలో మంటలు వ్యాపించినట్లు సమాచారం.