తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా కంచి, తిరుమల పర్యటనకు ఈ రోజు ఉదయం బయల్దేరి వెళ్లారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి కేసీఆర్ రోడ్డు మార్గాన తమిళనాడ్ లోని కంచికి పయనం అయ్యారు. రోడ్డు మార్గంలో వెళ్తున్న సీఎం కేసీఆర్ నగరికి చేరుకోగానే అపూర్వ స్వాగతం లభించింది.నగరి చేరుకున్న సీఎం కేసీఆర్కు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా ఘనస్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ కంచికి బయల్దేరారు.
కుటుంబ సమేతంగా కంచి అత్తివరదరాజ స్వామిని సీఎం కేసీఆర్ దర్శించుకోనున్నారు. అనంతరం తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు. 40 ఏళ్లకు ఒకసారి జరిగే అత్తి వరదరాజస్వామి దర్శనం ఆగస్టు 17తో ముగుస్తుంది. ఆగస్టు 18న స్వామిని తిగిరి పుష్కరిణిలో భద్రపరుస్తారు. అందువల్లే ఈ ఆలయానికి ఇప్పుడు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.



ఒక్క సంతకంతో వేల బస్సులను రోడ్లపైకి తీసుకోస్తా: కేసీఆర్