పోలీసులు సోనీ అనే యువతిని కిడ్నాప్ చేసిన రవిశంకర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏపీ పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారని సమాచారం. కిడ్నాప్ చేసిన ఆరు రోజుల అనంతరం సోనీని రవిశంకర్ హైదరాబాద్ ఎంజీబీఎస్‌లో వదిలి వెళ్లాడు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ చిరువ్యాపారిని నమ్మించి అతడి కుమార్తెను రవి శేఖర్ కారులో ఎత్తుకెళ్లాడు. యువతి ఆచూకీ కోసం తెలంగాణ పోలీసులు గాలింపు చేపట్టారు.
ఎంజీబీఎస్ బస్టాండ్‌లో రవిశంకర్.. సోనీని వదిలి వెళ్లాడు. దీంతో సోనీ తన తండ్రి, మామయ్యకు ఫోన్ చేసి విషయం తెలిపింది. హైదరాబాద్‌లో కిడ్నాప్ అనంతరం కడప జిల్లా ఒంటిమిట్ట, తిరుపతి తీసుకు వెళ్లి అనంతరం హైదరాబాద్ తీసుకువచ్చి అక్కడ వదిలి వెళ్ళినట్టు తెలుస్తోంది. సోనీ తండ్రి సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన పోలీసులు, ఏపీ పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు.
కోడెల మృతిపై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!