లారీ ఏలీ మురిల్లో మోన్కాడా అనే 25 ఏళ్ళ యువకుడు కౌన్సిల్ బ్లఫ్స్‌లోని నో ఫ్రీల్స్ సూపర్ మార్కెట్‌లో పనిచేసే వాడు. ఈ క్రమంలో 2009, నవంబర్ 28 నుంచి ఉన్నట్టుండి కనిపించకుండా పోయాడు. అయితే, ఈ ఏడాది జనవరి 24న సూపర్ మార్కెట్‌లోని కొన్ని కూలర్లు పనిచేయకపోవడంతో వాటిని తొలగించారు. పాడైపోయిన కూలర్లను తొలగించే క్రమంలో ఓ కూలర్ వెనక మనిషి అవశేషాలు కనిపించాయి. దాంతో పోలీసులకు సమాచారం అందించాడు సూపర్ మార్కెట్ యజమాని. పోలీసులు ఆ అవశేషాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కాగా, తాజాగా వచ్చిన ఆ పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైన విషయం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఆ అవశేషాలు గత పదేళ్లుగా కనిపించకుండా పోయిన మోన్కాడావని తేలింది. దాంతో ఈ కేసు విషయమై అసలు ఆ రోజు ఏం జరిగి ఉంటుందని తెలుసుకునేందుకు పోలీసులు నో ఫ్రీల్స్ సూపర్ మార్కెట్‌కు వెళ్లారు. ఆ రోజు ఇంట్లో గొడవడి సూపర్ మార్కెట్‌కు వచ్చిన మోన్కాడా కూలర్లపై ఎక్కాడు. ప్రమాదవశాత్తు అతడు కూలర్, గోడ మధ్య గల 18 అంగుళాల గ్యాప్‌లో పడిపోయాడు. దాంతో ఊపిరాడక అక్కడే మృతిచెందాడు. ఇక ఆ వైపు ఎవరూ వెళ్లకపోవడంతో మోన్కాడా జాడ తెలియకుండా పోయింది. తాజాగా కూలర్లు చెడిపోవడంతో వాటిని మార్చేందుకు సూపర్ మార్కెట్ సిబ్బంది ప్రయత్నించడంతో అవశేషాలు బయటపడ్డాయి. దీంతో పోలీసులు ఇప్పుడు ఈ కోల్డ్ కేసును మూసివేసినట్లు వెల్లడించారు.


ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో అధ్వానపు చదువు: జయప్రకాశ్