ప్రపంచకప్‌లో భాగంగా నేడు న్యూజిలాండ్-ఇంగ్లాండ్ పోటీపడుతున్నాయి. ఈ పోరులో గెలుపు సెమీస్ చేరే మూడో జట్టు ఏదో తేల్చనుంది. పట్టికలో మూడో స్థానంలోని న్యూజిలాండ్, నాలుగో స్థానంలోని ఇంగ్లాండ్ చెస్టర్లీ వేదికగా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఇంగ్లిష్ సారథి ఇయాన్ మోర్గాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియా, భారత్ సెమీస్ చేరిన సంగతి తెలిసిందే. నేటి ఈ మ్యాచ్ లో పాక్ న్యూజిలాండ్ గెలవాలని కోరుకోవటం విశేషం.
ఇంగ్లాండ్ జట్టు : జేసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, ఇయాన్ మోర్గాన్, బెన్‌స్టోక్స్, జోస్ బట్లర్, క్రిస్‌వోక్స్, లియామ్ ఫ్లంకెట్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్‌వుడ్
న్యూజిలాండ్ జట్టు : మార్టిన్ గప్తిల్, హెన్రీ నికోల్స్, కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, టామ్ లేథమ్, కొలిన్ డి గ్రాండ్ హోమ్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ, మాట్ హెన్రీ, ట్రెంట్‌బౌల్ట్