telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎల్లుండి గన్‌పార్క్‌కు రా…కేటీఆర్‌కు సవాల్‌ !

మంత్రి కేటీఆర్‌పై ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఫైర్‌ అయ్యారు. టీఆరెస్ పార్టీకి సిగ్గు, శరం లేదని… కేటీఆర్ వ్యవహార శైలి చూస్తే నవ్వొస్తుందంటూ మండిపడ్డారు. ఉద్యోగాలను కల్పించామని అబద్దం చెబుతున్నారని… ప్రగతి భవన్ లో కూర్చొని డ్రామాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. మీ కోసమేనా యువత బలిదానాలు చేసుకున్నదని… నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. కవిత ఓడిపోతే.. ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చే వరకు నిద్రపోలేదని.. లక్ష 32 వేల ఉద్యోగాలు.. ఇచ్చాం అని ఎట్ల చెబుతారని నిలదీశారు. అవినీతి సొమ్ముతో.. ఓట్లు కొనడానికి సిద్ధంగా వున్నారా… కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని వదిలి పెట్టబోదని హెచ్చరించారు. ఈ నెల 26న 12 గంటలకు గన్ పార్క్ వద్ద ఉద్యోగాల భర్తీపై బహిరంగ చర్చకు సిద్ధమని కేటీఆర్ కు సవాల్‌ విసిరారు. లేదంటే ఉద్యోగాల భర్తీపై అన్ని అబద్దాలేనని కేటీఆర్‌ ఒప్పుకోవాలని తెలిపారు. ఐటీఐఆర్ విషయంలో.. పొన్నాల ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు 50వేల ఎకరాలను కేటాయించారని… కేంద్రం నిధులు కేటాయించలేదని కేటీఆర్ అబద్దం చెబుతున్నారని మండిపడ్డారు. నిధులు తీసుకురావడంలో టీఆరెస్ ఎంపీలు ఏం చేస్తున్నారని… పీఆర్సీ విషయంలో కూడా సర్కార్ ఉద్యోగులను మోసం చేస్తున్నారని నిప్పులు చెరిగారు.

Related posts