జమ్మూకశ్మీర్లో రాష్ట్రపతి పాలనను పొడగించే తీర్మానాన్ని ఇప్పటికే కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. రాష్ట్రపతి పాలనను ఆర్నెళ్లు పొడిగించాలన్న బిల్లును ఇవాళ రాజ్యసభలోకేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ బిల్లుతో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలల పాటు పొడిగించే బిల్లును కేంద్ర హోంమంత్రి రాజ్యసభలో ఈరోజు ప్రవేశపెట్టారు.
ఈ బిల్లులకు మద్దతు ప్రకటించాలని మమతాబెనర్జీ పార్టీ టీఎంసీ నిర్ణయించింది. మరోవైపు, జమ్ముకశ్మీర్ లో రాష్ట్రపతి పాలన పొడిగింపు బిల్లుకు తాము మద్దతు పలుకుతున్నట్టు సమాజ్ వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రామ్ గోపాల్ యాదవ్ సభలో ప్రకటించారు. మరోవైపు ఈ బిల్లుకు సమాజ్వాదీ పార్టీ మద్దతు తెలుపగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం వ్యతిరేకిస్తోంది. రంజాన్ పండుగ, అమర్నాథ్ యాత్ర వంటి సాకులతో జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయడం సరికాదని కాంగ్రెస్ ఎంపీ విప్లవ్ ఠాకూర్ కేంద్రం తీరును తప్పుబట్టారు.