telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

టీడీపీలో వార్‌ : కేశినాని నానికి బోండా ఉమ సవాల్‌.. రాజీనామా చేసి గెలువాలంటూ

ఆంధ్ర ప్రదేశ్‌లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మున్సిపల్‌ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో టీడీపీ సీనియర్‌ నేతల మధ్య వార్‌ నడుస్తోంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ మరోసారి కేశినాని నానిపై విరుచుకుపడ్డారు. కేశినేని నాని ప్రవర్తన..ఒంటెద్దు పోకడల మనస్తాపమని..కేశినేని అహంకారంతో మాట్లాడుతున్నాడని ఫైర్‌ అయ్యారు. అధిష్ఠానాన్ని ఎదిరించి మరీ నాని మాట్లాడుతున్నాడని…మేము పార్టీ కోసం పని చేస్తే… నాని పదవుల కోసం పని చేస్తున్నాడని ఆరోపించారు. కేశినేని తీరుతో పార్టీలో అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయని..టీడీపీని కులసంఘంగా నాని మార్చాలి అనుకుంటున్నాడా !? అని బోండా ఉమ నిప్పులు చెరిగారు. కేశినేనికి దమ్ము ఉంటే వెంటనే రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా గెలవాలని సవాల్‌ విసిరారు. నాని ఉంటే చంద్రబాబు పర్యటనలో మేము పాల్గొనబోమని…నానిని కంట్రోల్ చేయాలని పేర్కొన్నారు.

Related posts