మా హీరో గొప్పంటే, మా హీరో గొప్ప అనే వివాదాలు సోషల్ మీడియాలో తరచుగా జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరోల అభిమానుల మధ్య ఇలాంటి వివాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అజిత్, విజయ్ అభిమానులు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. మరో రెండు రోజుల్లో విజయ్ పుట్టినరోజు ఉండగా మరోసారి ఫ్యాన్స్ వార్ తెర మీదకు వచ్చింది. ఈ నెల 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు కామన్ డీపీని డిజైన్ చేయించారు. దీన్ని సోషల్ మీడియాలో విడుదల చేయగా… అజిత్ ఫ్యాన్స్ లో కొందరు #June22VijayDeathDay అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు. కొద్దినిమిషాల్లోనే ఈ హ్యాష్ ట్యాగ్ చెన్నై ట్రెండ్స్ లో టాప్ లోకి వచ్చింది. వెంటనే కౌంటర్ గా విజయ్ ఫ్యాన్స్ #LongLiveThalapathy అనే ట్యాగ్ ని ట్రెండ్ చేశారు. గతంలో కూడా ఇలానే విజయ్, అజిత్ ఫ్యాన్స్ మధ్య వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఇద్దరు హీరోలు తమ అభిమానులను ఎంతగా కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తున్నా కూడా అభిమానులు ఆగడం లేదు.
previous post