సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “వన్, నేనొక్కడినే, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి” సినిమాలకు దేవి శ్రీ సంగీతం అందించిన విషయం తెలిసిందే. మహేష్ ప్రస్తుతం నటిస్తున్న “సరిలేరు నీకెవ్వరు” సినిమాకు కూడా దేవిశ్రీయే సంగీత దర్శకుడు. ఈ సినిమా ప్రారంభోత్సవం ఈరోజు (శుక్రవారం) జరిగింది. ఈ సందర్భంగా దేవిశ్రీప్రసాద్, హీరోయిన్ రష్మికా మందన్నా విలేకరులతో మాట్లాడారు. “మరోసారి మహేష్ సర్‌తో పనిచేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మహేష్ సినిమాల్లో ఊర మాస్ పాటలు ఉండాలని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో మెసేజ్‌లు పెడుతుంటారు. ఇప్పటివరకు అలాంటి అవకాశం రాలేదు. కానీ, ఇప్పుడు చెబుతున్నా.. “సరిలేరు నీకెవ్వరు” సినిమాలో కచ్చితంగా ఓ ఊర మాస్ పాట ఉంటుంది. అభిమానులకు ఇదే నా హామీ` అని దేవి అన్నారు. అనంతరం రష్మిక మాట్లాడుతూ… మహేష్ సర్‌తో కలిసి పనిచేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని, షూటింగ్ కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను” అని చెప్పింది.
previous post
next post