వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం కొమ్మాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-బైక్ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కారు నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
							previous post
						
						
					


ఏపీకి కేంద్రం నుంచి సహకారం: కన్నా