బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ విభిన్నమైన, విలక్షణమైన పాత్రలతో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఒకవైపు హిందీలో వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు తెలుగులోనూ “సైరా” సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారు అమితాబ్. ఇక తొలిసారిగా తమిళంలో అమితాబ్ ప్రధానపాత్రధారిగా ఒక సినిమా చేయనున్నారు. ఈ చిత్రం “ఉయర్నత మణిదాన్” అనే టైటిల్ తో రూపొందుతోంది. ఈ సినిమాకు తమిళవాణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో దర్శకుడు ఎస్.జె. సూర్య ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ఇక అమితాబ్ సరసన రమ్యకృష్ణ నటించనున్నారనేది తాజా సమాచారం. ఈ చిత్రంలో అమితాబ్ కు సంబంధించిన లుక్ ను ఇటీవలే విడుదల చేశారు. తాజాగా ఈ చిత్రం సెట్స్ పైకి వచ్చేసిందంటూ షూటింగ్ సమయంలోని కొన్ని స్టిల్స్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈ స్టిల్స్ లో అడ్డబొట్టు, పంచెకట్టుతో తమిళనాడు స్టైల్ లో ఉన్న అమితాబ్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను తమిళంతో పాటు హిందీలోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
previous post

