ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీల స్వల్పంగా తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రూ డౌన్ విధానాన్ని అమలు చేయడం ద్వారా యూనిట్‌కు 13 పైసలు విద్యుత్ ఛార్జీలు తగ్గనున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు.
ప్రజలపై విద్యుత్ భారం తగ్గించడమే లక్ష్యంగా దాదాపు రూ.4,498 కోట్ల విలువైన విద్యుత్ బకాయిలను ప్రభుత్వం స్వయంగా భరించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.
దీని ఫలితంగానే విద్యుత్ సుంకం తగ్గింపు సాధ్యమైందన్నారు. తమ ఐదేళ్ల పాలనలో ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంట్ ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేశారు.
ట్రూ డౌన్ విధానం ద్వారా గృహ వినియోగదారులు, రైతులు, పరిశ్రమలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నామని గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.
రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి ఈ విధానం అమలు చేస్తున్నామని, ప్రజల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొస్తున్నామని అన్నారు.
గత ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించిన మంత్రి, ప్రస్తుతం పారదర్శకంగా పాలన కొనసాగిస్తున్నామని తెలిపారు.


జగన్, చంద్రబాబు ఇద్దరూ దొంగలే: సీపీఐ నారాయణ