హీరో గోపీచంద్ నటించిన సాహసం సినిమాలోలాగా కొన్ని పాకిస్థాన్‌లోని ఆలయాలకు లింక్ చేసి తెరకెక్కిస్తుంటారు.. పాక్‌లో ఆలయం ఉండడం.. మన హీరోకు కీ దొరకడం లాంటి కథలు.. ఇక, గుప్త నిధులు దాచిన స్టోరీలు కూడా చూశాం.. కానీ, ఇప్పుడు నిజంగానే పాకిస్థాన్‌లో అతిపురాతనమైన ఆలయం బయటపడింది… పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాల్లో 1300 ఏళ్ల నాటి పురాతన శ్రీమహావిష్ణువు ఆలయాన్ని గుర్తించారు.. వాయవ్య పాకిస్థాన్‌లోని స్వాట్ జిల్లాలోబరీకోట్ ఘుండాయ్ దగ్గర పాకిస్థాన్, ఇటలీకి చెందిన పురావస్తుశాఖ నిపుణులు జరిపిన తవ్వకాల్లో ఈ ఆలయం బయటపడినట్టు పురావస్తు శాఖ చీఫ్ ఫజల్ ఖాలిక్ తెలిపారు. హిందూ షాహి రాజ్యంలో 1300 ఏళ్ల కిందట ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆయన వెల్లడించారు. కాగా, హిందూ షాహీస్ లేదా కాబూల్ షాహీస్ ఒక హిందూ రాజ్యవంశంగా చెబుతారు.. క్రీస్తు శకం 850-1026 మధ్య ఈ వంశస్థులు ఇప్పుడు పాకిస్థాన్‌లో భాగమైన కాబూల్ లోయ, గాంధారా, అదేవిధంగా వాయవ్య భారత్ ప్రాంతాన్ని పరిపాలించినట్టు చరిత్ర చెబుతోంది. వారే ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా అభిప్రాయపడుతున్నారు. ఇక, ఆలయ పరిసరాల్లో కంటోన్మెంట్, వాచ్‌టవర్ జాడలు కూడా గుర్తించినట్టు పురావస్తు శాఖ అధికారులు పేర్కొన్నారు.
previous post
ఉల్లి కోసం ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి: లోకేశ్