బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశం తెలంగాణ పై ఇటీవల హైకోర్టు స్టే ఇవ్వగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తడుతుండడం మరింత ఉత్కంఠ రేపుతోంది.
42శాతం బీసీ రిజర్వేషన్లను సవాల్‌గా తీసుకుని న్యాయం పోరాటానికి రెడీ అయింది.
సుప్రీంకోర్టులో ఇవాళ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనుండడంతో ఢిల్లీకి పంపేందుకు ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.
మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరితో పాటు కాంగ్రెస్ తరపున టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ ఢిల్లీ వెళ్తారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున హైకోర్టు జోక్యం సరికాదని సుప్రీంకోర్టులో వాదించబోతోంది.
హైకోర్టు స్టే అంశంపై ఇప్పటికే న్యాయ నిపుణులతో ప్రాథమికంగా చర్చలు కూడా నిర్వహించింది రేవంత్ సర్కార్.