తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అభిమానులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
కేటీఆర్కు శుభాకాంక్షలు తెలిపేందుకు తెలంగాణ భవన్కు వచ్చిన అభిమానులు, కార్యకర్తలు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ క్రమంలో ఒక మహిళా అభిమాని ఆయనతో ముచ్చటించి, సెల్ఫీ దిగింది. అనంతరం ముద్దు పెట్టడానికి ప్రయత్నించగా, కేటీఆర్ సున్నితంగా వెనక్కి తగ్గి ఆమెను వారించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది.